
పయ నించే సూర్యుడు జూలై 16 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ముఖ్య అతిథులుగా ఇంచార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, సుజయకృష్ణ రంగారావు పాల్గొన్నారు*పి.గన్నవరం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : పి.గన్న వరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పి.గన్నవరంలోని ధనవర్ష ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి అధ్యక్షత వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు మరియు జోన్ 2 ఇంచార్జ్ రావు సుజయకృష్ణ రంగారావు హాజరయ్యారు.జిల్లా ఇంచార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి స్థానిక నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు.అనంతరం పి.గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నియామకం అంశంపై నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. పార్టీకి అంకితభావంతో పని చేసే నాయకుడిని ఇంచార్జ్‌గా నియమిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, పి.గన్న వరం నియోజకవర్గ కో కన్వీనర్లు మోకా ఆనందసాగర్, దాసరి వీరవెంకట సత్యనారాయణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సమావేశం అంతా పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. నాయకుల ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.