
ప్రభుత్వానికి ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పత్రిక ప్రకటన ద్వారా విజ్ఞప్తి
ఏపీ. పి.హెచ్. సి.డి.ఏ కి సంపూర్ణ మద్దతు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 1
ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు పత్రిక ప్రకటన విడుదల చేస్తూ గత నెల 25వ తేదీన నుండి ప్రాధమిక ఆరోగ్య కేంద్రలలో పని చేస్తున్న డాక్టర్స్ తమ న్యాయమైన సమస్యలు ఇన్ సర్వీస్ లో ఉన్న డాక్టర్స్ కి పి జి కోటా సీట్లు క్లినికల్ 30% నుండి 15% వరకు అలాగే నాన్ క్లినికల్ కోటాలో 50% నుండి 30% వరకు తగ్గించారు మరియు ఏజెన్సీ లో పని చేస్తున్న డాక్టర్స్ కి ఏజెన్సీ అలవెన్సెస్ ఇవ్వడం లేదు, టైమ్ బాండ్ పదోన్నతులు కల్పించడం లేదు, చంద్రన్న సంచార చికిత్స లో రావాల్సిన అలవెన్స్ 4 వేలు రూపాయలు ఇవ్వడం లేదు అని పై సమస్యను పరిష్కరించాలని కోరుతూ శాంతియుత నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఈ డిమాండ్స్ గతంలో కూడా డాక్టర్స్ కీ ప్రభుత్వాలు అమలు చేస్తూ వస్తూనే ఉన్నారు వాళ్ళు అడిగేవి కొత్త డిమాండ్స్ ఐతే కాదు కాబట్టి ప్రభుత్వం వారు కూడా ఈ విషయాలను త్వరగా పరిష్కారం చేసే దిశగా ఆలోచన చెయ్యాలని ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరుపున పత్రిక ప్రకటన ద్వారా కోరుతున్నామని అన్నారు డాక్టర్స్ కోరుతున్న ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు పోరాడుతున్న డాక్టర్లు కు మా ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు అత్యవసర పరిస్థితులలో ఉండాల్సిన డాక్టర్స్ రోడ్డు మీదకు రావడం వలన ప్రజలు అత్యవసర పరిస్థితులలో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తాయని అలాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేశారు మరియు ప్రాధమిక ఆరోగ్య కేంద్రలలో డాక్టర్స్ లేక పారామెడికల్ సిబ్బంది తో వైద్య సేవలు నడుస్తున్నప్పుడు ఏమైనా గొడవలు జరిగితే దానికి బాధ్యులు కూడా ప్రభుత్వమే అవుతుంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలో పని చేస్తున్న డాక్టర్స్ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి డాక్టర్స్ అందరు డ్యూటీలలో వచ్చే విధంగా చూడాలని, అత్యవసర సేవలు ప్రజలకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రభుత్వానికి ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరుపున విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు