పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి మే 19
దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమం శ్యామల వెంకటరెడ్డి భవనంలో జరిగింది పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పల్లపు పెద్ద రాములు పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు పోడియం లక్ష్మణ్ పూలదండ వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంతఆదర్శవంతమైన నాయకుల్లో అగ్రస్థానం పుచ్చలపల్లి సుందరయ్య.రాజకీయ విభేదాలతో నిమిత్తం లేకుండా ఆయనను అభిమానించేవారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమంలోనూ వెలుపల కోకొల్లలు గా ఉన్నారు. జాతీయస్థాయిలో సైతం యవ్వనంలోనే ఉన్నత విలువలు పాటించే నెహ్రు లాంటి వారే అభిమానాన్ని సైతం చురగ్గొన్న వ్యక్తి . తనతో రాజకీయంగా వివేదించే వారిని సైతం ఆయన గౌరవించేవారు. తెలంగాణ రైతంగ సాయుధ పోరాటానికి ప్రత్యక్ష సారథ్యం వహించిన సుందరయ్య భారతదేశ విముక్తికి మార్గం చూపారు. సిద్ధాంతాన్ని ఆచరణాలతో మేలవించగలిగిన ఆయన శక్తి సామర్థ్యాలను గుర్తించిన సిపిఐ ఎం ప్రధమ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నుకున్నది. బ్రష్టు పట్టిన నేటి రాజకీయ వ్యవస్థలో ఉన్నత విలువలు గల సుందరయ్య గారి లాంటివారు మరల ఎదిగి వస్తేనే వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది . కమ్యూనిస్టు ఉద్యమం వర్గ పోరాటాలు మాత్రమే అలాంటి వ్యక్తుల్ని సృష్టించగలుగుతాయి. సంక్షోభంలో కూరుకుపోయిన పెట్టుబడిదారీ వ్యవస్థ ఫలితంగానే రాజకీయ విలువలు సైతం దిగజారిపోతున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిన నేపథ్యంలో అత్యంత లాభదాయకమైన వ్యాపారంగం రాజకీయాలు మారిపోయాయి. సమాజాన్ని ఎదుర్కొంటున్నాం ఈ పేడదొరణాలు కమ్యూనిస్టు ఉద్యమంలోకి సైతం ప్రవేశించాయి. అటువంటి దోర్నాలన్నీ చూసి బూర్జవ పార్టీలకు కమ్యూనిస్టు పార్టీలకు తేడా లేదని పార్టీ అభిమానులు కొందరు బాధపడుతున్నారు. అని అన్నారు. నేటి రాజకీయ నాయకులు సుందరయ్య సూక్తితో ఆరోజు సుందరయ్య గారు సైకిల్ మీదికి అసెంబ్లీకి పార్లమెంట్ కి వెళ్లిన రోజులు మరొకసారి గుర్తు చేశారు. ఉద్యమంలో ఎక్కడ అడ్డుపడతారని పిల్లల్ని కూడా కనకుండా ప్రజల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తెప్పల లక్ష్మయ్య . వీరబోయిన దిలీప్. పాండు నాగార్జున్. కారం సుందరయ్య. తదితరులు పాల్గొన్నారు