పుట్టినరోజు సందర్భంగా పండ్లు మరియు బ్రెడ్లు పంపిణీ*
పయనించే సూర్యుడు// న్యూస్// ఏప్రిల్ 15//మక్తల్//రిపోర్టర్ సి తిమ్మప్ప//
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామానికి చెందిన వడ్ల నరేష్ కుమారుడు మల్లికార్జున పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్లకు మరియు స్థానిక ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఉండే వారికి పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. సందర్భంగా నరేష్ మాట్లాడుతూ రాబోవు రోజుల్లో తన కుమారుడి ప్రతి పుట్టినరోజు కు ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమం చేయ తలపెట్టినట్లు తెలిపాడు. అనంతరం పండ్లు స్వీకరించిన వారు మల్లికార్జున్ నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నరేష్ కుమారుడు మల్లికార్జున్ తో పాటు నరేష్ స్నేహితులు. కట్టెల మిషన్ రాజు. రంకుల శ్రీనివాసులు. ఉజ్జల్లి మోనేష్. మాధ్వార్ వడ్ల శ్రీనివాస్. DTS ఆటో నాగరాజు. పాల్గొన్నారు.