పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 10:- రిపోర్టర్ (షేక్ కరిముల్లా )
బాపట్ల పురపాలక సంఘ పరిధిలో ఈరోజు తెల్లవారుజాము నుండే మునిసిపల్ కమిషనర్.జి. రఘునాథరెడ్డి సిబ్బందితో కలిసి పర్యటించారు.ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి దేవస్థానం వద్ద పారిశుధ్యాన్ని పరిశీలించి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రైతు బజార్ ను పరిశీలించారు. దేవుని మాన్యం వద్ద నూతనంగా గృహాల నిర్మించుకున్న యజమానులు త్రాగునీటి సరఫరా అందడం లేదని కమిషనర్ వారికి తెలియజేశారు,పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ చేసి త్వరలోనే నీటి సరఫరా చేస్తామని కమిషనర్ గారు వారికి హామీ ఇచ్చారు.తదుపరి సూర్యలంక రోడ్డులోని అన్న క్యాంటీన్ పరిశీలించి ప్రజలను ఆహార నాణ్యత, శుభ్రత,త్రాగునీరు గురించి వివరాల అడిగి తెలుసుకున్నారు, అన్న క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడుతూ క్యాంటీన్ పరిసరాలు శుభ్రతపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని త్రాగునీరు విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.అనంతరం జమ్ములపాలెం రైల్వేఅండర్ బ్రిడ్జి దగ్గర ప్రధాన డ్రైనేజీ నీరు పారుదల అనేక రోజుల నుండి సక్