పయనించే సూర్యుడు జనవరి 21, దేవరకొండ టౌన్ న్యూస్, రిపోర్టర్, వల్లపు నరేష్,నల్గొండ జిల్లా.
దేవరకొండ లోని స్థానిక శాఖ గ్రంధాలయంలో ఈ రోజు మధ్యాహ్నం..కవి, ఆర్టిస్ట్ సఖీలినేని జీవ రాసిన.. బాలానందం... కవితా సంపుటిని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ ఆవిష్కరిం చారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ రచయితలు ఎంతో సామాజిక స్పృహతో రచనలు చేస్తారని.. అవి సమాజానికి మేల్కొల్పేవిధంగా దోహదపడతాయని... రచనలు ఎంతో స్ఫూర్తి దాయాకమని తెలియజేస్తూ కవి, రచయిత సకిలినేని జీవ రాసిన బాలానందం కవితా సంపుటి చిన్నారలకి మానసిక ఆహ్లా దాన్ని అందిస్తాయని అలాగే రచయిత కృషిని కొనియాడుతూ మరిన్ని రచనలు చేయాల్సిందిగా ప్రోత్సహించారు. ఈ పుస్తకావిష్కరణ సభకి తెస్సా అధ్యక్షులు పర్చ వాసుదేవారావు అధ్యక్షత వహించగా మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా మరియు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ సిరాజఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ వదత్య దేవేందర్ నాయక్ మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటయగౌడ్ టౌన్ ప్రెసిడెంట్ యూనుస్ బి. సి. సంక్షేమసంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ చోళ్ళేటి భాస్కారాచారి కంబాలపల్లి వెంకటయ్య తెస్సా సభ్యులు ఉడుత సలే శ్వర్ యాదవ్ అడపాల శేకేర్ రెడ్డి బిక్కుమాళ్ల లక్ష్మినారాయణ గడ్డం బిక్ష్మయ్య యం. డి. రంజాన్ బేగ్ వెంకటరమణ మెరుగుశ్రీను లతో బాటు పండ్ల గోపి కొమ్ము రాజశేకేర్ ఎర్ర ఆంజనేయులు సుకుమయ్య నల్ల వెంకటయ్య లతో బాటు జీవ మిత్రులు మరియు పోటీ పరీక్షలకి ప్రేపరయ్యే విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంధాలయం అధికారి శ్రావణ కుమార్ మరియు శారద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కవికి సన్మానిచ్చాడు జరిగింది.
తెస్సా తరఫున శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ కి సన్మానం చేయడం జరిగింది.