ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా పూల జయంతి
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్. రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం మహత్మా జ్యోతిబా పూలే 198 వ జయంతి సందర్భంగా సామాజిక ప్రజా సంఘాల సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం. జన విజ్ఞాన వేదిక గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన జాతుల కోసం సమానత్వ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఆ మహనీయుని ఆశయాలను సమాజానికి అతను చేసిన సేవలను ప్రజలకు చెప్పే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పూలే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ అధీనంలో ఉండాలని కార్మికులు చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కాలని కోరుకున్నాడని కానీ బిజెపి పాలన పూలే ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్నదని విమర్శించారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేసి కార్మిక వర్గానికి ఉపాధి లేకుండా చేసిందని విమర్శించారు సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వాన్ని ఇవ్వాలని ఉద్యమించిన జ్యోతిబాపూలే ఆశయాలకు విరుద్ధంగా నేను కేంద్ర ప్రభుత్వం అసమానత్వాన్ని పెంచి పోషించే చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు పూలే బాటలో కార్మిక వర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సృష్టించే విద్వేష రాజకీయాలకు దూరంగా ఐక్యంగా ఉండి పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ వివిధ సామాజిక ప్రజా సంఘాల నాయకులు. శ్రీను నాయక్ ఈశ్వర్ వెంకటరమణ కురుమయ్య కే రాజు. రాజు నాయక్. పద్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు