పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా 9 తేదీ ఏప్రిల్
బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు జయలక్ష్మి . డివిజన్ నాయకులు హాజీ భీమేష్ లు కోటకొండ భగత్ సింగ్ చౌరస్తాలో కాళీ సిలిండర్లతో నిరసన తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 400 ఉన్న సిలిండర్ ని 1000 రూపాయల పెంచిన ఘనత కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. అధికారంలో మూడోసారి వచ్చినా కూడా ధరలు పెంచుకుంటూ సామాన్య ప్రజల నడ్డి పిరుస్తున్నారు అని అన్నారు. సిలిండర్ పెట్రోల్ బ్యాంకుల వడ్డీలు పెంచుకుంటూ పోతూ ఉన్న పాలకులు. ఎవరైనా ఉన్నారు అంటే బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వమే అని అన్నారు నెంబర్ వన్ పాలకులు . ఆదాని అంబానీ ముఖేష్ అంబానీ లా రుణాలను మాఫీ చేస్తూ సామాన్య నడ్డి విరుస్తూ ప్రజలను అన్నారు. నిన్నటికి నిన్న 50 రూపాయలు సిలిండర్ ధర పెంచడంతో గ్రామాల్లో ఉంటున్న పేద మహిళల పరిస్థితి ఏమిటో బిజెపి వారు ఆలోచించాలని అన్నారు. ఉచితల పేరుతో మొదటికి మోసం చేసి తర్వాత అమాంతం ధరలను పెంచుకుంటా పోతున్న ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఇప్పటికైనా ఈ పిలిచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంబడి తగ్గించాలని లేకపోతే బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రజలే చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ కనకప్ప సుభాష్ వెంకటయ్య లక్ష్మీ గుండెగారి పద్మమ్మ లక్ష్మి సాబీర్ మిట్టే కాశీం బాలప్ప కొత్వాల్ యూసుఫ్ ఆఫ్రిద్ తదితరులు పాల్గొన్నారు