
పయనించే సూర్యుడు డిసెంబర్2 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లెమండలం
అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామంలోని చెరుకువాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల లో పూర్తిగా దెబ్బతినిపోయి పెచ్చులూడుతున్న ఈ పాఠశాలలో 20 మంది విద్యార్థులు చదువు తున్నారు ఒక ఉపాధ్యాయురాలుపనిచేస్తున్నారు ఈ మధ్యకాలంలో అనేక రకాల తుపానులు వెంటవెంటనే వస్తున్నవి దీనిని చూసి ఆ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వాన పడిందంటే పిల్లల్ని స్కూల్కు పంపించడం లేదు దానికి తోడు ఎంఈఓ గానీ అక్కడ పనిచేస్తున్న టీచర్లు కానీ పట్టించుకోకపోవడంతో వర్షం వస్తే బయటకాని లోపల కానీ కూర్చునే పరిస్థితి లేదు విద్యార్థులకు దీనిని తల్లిదండ్రులు పూర్తిగా ఖండిస్తూ ఎంఈఓ గారికి ఎండిఓ కి డీఈఓ కి పలుమార్లు విజ్ఞప్తి చేసుకున్నారు అయినను అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా కొనసాగుతోంది. దీనిని ప్రస్తుత గవర్నమెంటు పట్టించుకుని ఒక మంచి బిల్డింగును ఏర్పాటు చేసి ఇవ్వవలసిందిగా విద్యార్థుల తల్లి తండ్రులు కోరుకుంటున్నారు
