పయనించే సూర్యుడు జనవరి 13( పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి )పాల్వంచ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లో గల కేశవా పురం- జగన్నాధపురం గ్రామాల మధ్య వెలసి యున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం (పెద్దమ్మ గుడి) నందు చండీ హోమం సోమవారం నాడు దేవస్థానం ఆవరణలో గల యాగశాలలో నిర్వహించడం జరిగింది ముందుగా మేళ తాళాలతో వేదమంత్రాలతో అమ్మవారి ఉత్సవ విగ్రహమును దేవాలయము నుండి యా గ శాలకు తీసుకువచ్చి, మండ పా రాధన గణపతి పూజలు జరిపి, అనంతరం చండీ హోమం చివరన పూర్ణ హుతి కార్యక్రమం నిర్వహించ బడింది. ఈ హోమంలో 16 మంది దంపతులు ఒక్కొక్కరు 2016రూపాయిలు రుసుము చెల్లించి చండీ హోమము లో పాల్గొన్నారు. చండీ హోమం అనంతరం అర్చకులు వేద పండితులు చండీ హోమంలో పాల్గొన్న వారికి ఆశీర్వచనము తో పాటు అమ్మవారి శేష వస్త్రం ప్రసాదం అంద జేసినారు. అనంతరం చండీ హోమం చేసుకున్న వ్రతంలో పాల్గొన్న భక్తుల కు అమ్మవారి అన్న ప్రసాదం వితరణ గావించ డం మైంది. అమ్మవారికి వైభవంగా భోగి పండ్లతో అభిషేకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశ్వాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య వెలసియున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం పెద్దమ్మ గుడిలో దేవస్థానకార్యనిర్వహణాధికారి రజిని కుమారి ఆదేశాల మేరకు సోమవార నాడు భోగి పండుగను పురస్కరించుకొని అమ్మవారికి భోగి పండ్లు రేగు పండ్లు పుష్పాలతో అభిషేకించారు తొలుత అర్చకులు సిబ్బంది భక్తులు భోగి పండ్లతో దేవాలయం చుట్టూ ప్రదీక్షన చేసిన పిదప అమ్మవారికి భోగి పండ్లు అభిషేకించారు. పూజలు అనంతరం భక్తులకు అమ్మవారికి అభిషేకం చేసిన భోగి పనులను వితరణ చేశారు.