
పయనించే సూర్యుడు, డిసెంబర్ 11( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )
చెరుకుపల్లి రాకేష్ తంగళ్ళపల్లి గ్రామ సర్పంచి అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తుపై పోటీ చేస్తున్న బహుజన వర్గాల నాయకుడు పెద్దూరి తిరుపతికి సీపీఎం, సీఐటీయూ తంగల్లపల్లి మండల కమిటీ తమ అధికారిక మద్దతును ప్రకటించింది. ఈ విషయాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కోడం రమణ వెల్లడించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 14వ తేదీ ఆదివారం జరుగనున్న ఎన్నికల్లో కార్మిక వర్గం, యువత, గ్రామ ప్రజలందరూ బ్యాలెట్ నెంబర్ 4 — ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి తిరుపతిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.గ్రామాభివృద్ధికి కృషి చేసే, యువతకు ఆదర్శంగా నిలిచే నాయకుడిగా తిరుపతి నిలుస్తాడని వారు పేర్కొన్నారు. పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు, ఆశా వర్కర్లు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలపాలని కోరారు.
