
పయనించే సూర్యుడు న్యూస్ :కరీంనగర్ కిసాన్ నగర్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని రహదారులు, డ్రైనేజీల దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు వారు రోడ్డుపై పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా ప్రకటించినప్పటికీ, నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు పూర్తిగా పాడైపోయాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పదేపదే అధికారులకు, పాలకులకు విన్నవించుకున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ వినూత్న పద్ధతిలో నిరసన తెలపాల్సి వచ్చిందని వారు తెలిపారు.