* ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి . ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ.పయనించే సూర్యుడు న్యూస్: జనవరి 30, పెనుగొండ- పశ్చిమగోదావరి జిల్లా రిపోర్టర్ అక్షింత్ :శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అత్మార్పణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 31న రాష్ట్ర ముఖ్యమంత్రి పెనుగొండ శ్రీ నగరేశ్వర, మహిషాసురమర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంను సందర్శించునున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా తొలుత హెలిపాడ్ ప్రాంతాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయాం అస్మి, జెసి రాహుల్ కుమార్ రెడ్డి , ముఖ్యమంత్రి సెక్యూరిటీ పర్యవేక్షకులు, అడిషనల్ ఎస్పీ రమణ, తదితరులు పరిశీలించారు. పెనుగొండ వ్యవసాయ మార్కెట్ యార్డు నందు జరుగుతున్న హెలిపాడ్ కాంక్రీట్ పనులను పరిశీలించి ఆర్ అండ్ బి అధికారులకు తగు సూచనలు చేశారు. అదే ప్రాంగణంలో ప్రముఖులు, అతిపెద్ద ప్రముఖులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు ఏర్పాటు చేస్తున్న ఎల్- వన్, ఎల్-టు ప్రాంతాలను సందర్శించి పలు సూచనలు చేశారు. మార్కెట్ యార్డ్ ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని డిపిఓ ను ఆదేశించారు. అనంతరం శ్రీ నగరేశ్వర, మహిషాస్వరమర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానమును సందర్శించి నగరేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం, ఆలయానికి అనుకొని ఉన్న నిత్యాన్నదాన సత్రం ప్రాంగణంలో జనవరి 31న హోమం నిర్వహించే ప్రాంతాన్ని సెక్యూరిటీ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయంలోని గోశాలను పరిశుభ్రంగా ఉంచి ముగ్గులతో అలంకరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా దేవాదాయ శాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం శ్రీ వాసవి శాంతి దామ్ ఋషి గోత్ర సువర్ణ మందిరాన్ని సందర్శించి ఆలయ ట్రస్ట్ డాక్టర్ పిఎన్ గోవిందరాజులు తో శాంతి ధామ్ లో నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం అధికారులతో సమావేశమై కార్యక్రమం ఏర్పాటుపై సమీక్షించారు. ఏ విధమైన లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల పరిశీలనలో దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ కే సుబ్బారావు, జిల్లా అడిషనల్ ఎస్పి వి భీమారావు, ముఖ్యమంత్రి సెక్యూరిటీ పర్యవేక్షకులు అడిషనల్ ఎస్పీ రమణ, ఆర్టీవోలు దాసిరాజు, ఖాతీబ్ కౌసర్ భానో, కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఇ వి సుబ్బారావు, డీఎస్పీలు డాక్టర్ శ్రీ వేద, ఎం వి వి సత్యనారాయణ, ఆర్ అండ్ బి ఈ రామరాజు, డి ఈ జి వరలక్ష్మి, డిపిఓ అరుణ, శ్రీ జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి నాగేశ్వరరావు, జిల్లా విద్యుత్ అధికారి రఘునాథ్ బాబు, సర్పంచ్ నక్క శ్యామల, దేవాలయాల తనిఖీ అధికారులు వి వెంకటేశ్వరరావు, జి ప్రసాద్, తాసిల్దార్ అనిత కుమారి, ఎంపీడీవో టీఎస్ మూర్తి, శ్రీ వాసవి దామ్ సెక్రెటరీ కె రాజు, పెనుగొండ సీఐ ఆర్ విజయ్ కుమార్, ఎస్సై గంగాధర్, అధికారులు మార్కెట్ యార్డ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.