పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి)ఆర్.ఎం.పి డాక్టర్ పెను మాల కృష్ణమూర్తి సేవలు అభినందనీయమని ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని రాష్ట్ర ఆర్ఎంపి అధ్యక్షులు నిడమర్తి సత్యరాజు తెలిపారు. కోనసీమ డాక్టర్ అంబేద్కర్ జిల్లా అల్లవరం మండలం గోడిలంక ఆయన స్వగ్రామంలో పేద కార్యానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు .ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ఎంపి కార్యదర్శి చిక్కాల రామచంద్రరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వీర్రాజు, రాష్ట్ర కోశాధికారి డిఎల్ రాజులు మరియు జిల్లా ఉపాధ్యక్షులు చింతలపూడి రామారావులు మాట్లాడుతూ గ్రామీణ వైద్యుడిగా ప్రజాసేవలో ఎప్పుడు ఉంటూ అందరి తోటి ఆప్యాయతగా మాట్లాడే మంచి వ్యక్తి పెనుమాల కృష్ణమూర్తి అని ఆయన లేకపోయినా ఆయన సేవలు ప్రతి ఒక్కరూ మనసులో ఉంటాయని అన్నారు. అంతేకాకుండా ఆయన మరణించిన అనంతరం తన రెండు కళ్ళను తన కుమారుడు ప్రసాద్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు కుమారుడు పెనుమాల ప్రసాద్, కుమార్తెలు లను పరామర్శించి ఓదార్చరు. ఈ సందర్భంగా రాష్ట్ర ఈసీ నెంబర్ కే భాస్కరరావు, కాకినాడ జిల్లా జాయింట్ సెక్రెటరీ బివి భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ తటవర్తి సుబ్బారావు, కాకినాడ కోకన్వీనర్ ఎన్ వెంకటేష్, కాకినాడ ఆర్ఎంపి మెంబర్స్ శివ మొదలైన సభ్యులు పాల్గొన్నారు.