---------వృద్ధులకు 4000 పెన్షన్ పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు ది
------------ మాట తప్పిన జగన్,ప్రజలను మోసం చేసిన వైసిపి
------------ మంత్రి సవితకు అడుగడున పూల వర్షంతో స్వాగతం పలికిన మహిళలు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 01 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా
శ్రీ సత్యసాయిజిల్లా పెనుకొండ మండలం వెంకటాపురం తాండా లో పెన్షన్ పంపిణి చేసిన మంత్రి సవితమ్మ ,ఈ సందర్భంగ మంత్రి సవితకు అడుగడుగున పూల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు.మహిళళు,వృధ్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణి చేసిన మంత్రి పలువురిని మాట్లాడారు,వృధ్ధులు వికలాంగూలు ఆనందంగా ఉందని,చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం అధికారులు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని,గతంలో పెన్షన్ కోసం కార్యాలయల చుట్టు తిరిగి అలిసిపోయేవారమని,చంద్రబాబు వచ్చాక మా పెన్షన్ నేరుగ ఇంటి వద్దకే వస్తోందని,చంద్రబాబు చల్లగా ఉండాలని దీవించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ పెన్షన్ మొదలుపెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారిని వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు ని తిరిగి అధికారంలోకి రాగానే 3000 ఉన్న పెన్షన్ 4000 చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు ని మంత్రి సవితమ్మ తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి 17వేల కోట్ల రూపాయలు సత్యసాయి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 63,000 మందికి 114 కోట్ల రూపాయలు అదేవిధంగా తినకుండా నియోజకవర్గ వ్యాప్తంగా 41 వేల మందికి 17 కోట్ల 62 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నామని వెంకటాపురం తండాలో 42 మంది గాను 1లక్ష 78,000 రూపాయలు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ఉచిత ఇసుకను అందజేస్తున్నామని ఇంటర్ కాలేజ్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్నం భోజనం పెడుతున్నామని, స్కూలు ప్రారంభోత్సవానికి విద్యార్థులకు తల్లికి వందనం, అదేవిధంగా రైతులకు రైతు భరోసా అందచేస్తామని తెలిపిన మంత్రి సవిత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ దావోస్ పర్యటన అనంతరం రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా సిసి రోడ్లు డ్రైనేజీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పెనుకొండ పట్టణాన్ని సుందరీ కారణంగా చేయబోతున్నామని ఫోకస్ లైట్లతో పాటు మున్సిపాలిటీలో నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు చేపట్టబోతున్నామని మంత్రి తెలిపారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి వైసిపి పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నామని పార్టీ ఉనికి కోసమే విమర్శలు చేస్తున్నారని వైసిపి పార్టీపై మండిపడ్డ సవిత ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..