పయనించే సూర్యుడు జనవరి 30 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు వనపర్తి జిల్లా,
పెబ్బేరు లోని మాస్టర్ మైండ్ స్కూలు ఆవరణ యందు గురువారం స్కూల్ ఆవరణలో 31 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా పెబ్బేర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ వాసుదేవరావు గారు మరియు పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి లావణ్య రంగారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణ ,ట్రాఫిక్ ఎడ్యుకేషన్ , ప్రయాణ సమయంలో అజాగ్రత్తగా వాహనాన్ని నడిపితే జరిగే పరిణామాలు, హెల్మెట్ మరియు సీట్ బెల్టుల వాడుక ప్రాముఖ్యత గురించి విద్యార్థినీ విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు.ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి లావణ్య రంగారెడ్డి మాట్లాడుతూ స్కూలు విద్యార్థులందరూ 18 సంవత్సరాలు నిండకుండా బైక్ నడపడం చట్టబద్ధము కాదని మరియు బస్సులలో ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసి రోడ్డు భద్రత విషయంలో విద్యార్థులకు అవగాహన కల్పించినటువంటి పెబ్బేర్ ఎం వి ఐ కృతజ్ఞతలు తెలిపారు .ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు ర్యాలీగా పెబ్బేరు పట్టణ పురవీధుల వెంబడి విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అవగాహన కల్పించడం జరిగినది . ఇట్టి ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి లావణ్య రంగారెడ్డి పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు మరియు పాఠశాల బస్సు డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయడం జరిగినది.