పయనించే సూర్యుడు జనవరి 11 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు వనపర్తి జిల్లా,
పెబ్భైర్ పట్టణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా పెబ్భైర్ పట్టణం 4వ వార్డ్ చెందిన కావలి క్రాంతి కుమార్ నియమితులయ్యారు ఈమెరకు జిల్లా కేంద్రం వనపర్తి లో జిల్లాకు చెందిన బిజెపి పార్టీ పదవులను ప్రకటించారు
భారతదేశంలోని ప్రధానమైన జాతీయ పార్టీ అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ పై ప్రత్యేక దృష్టిపెట్టి మెరికల్లాంటి కొత్త నాయకులను నియమిస్తుంది అందులో భాగంగా 35-45 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి మాత్రమే ప్రధానమైన పదవులను కట్టబెడుతూ అందులో భాగంగా పెబ్బేరు పట్టణ అధ్యక్షునిగా కావలి క్రాంతి కుమార్ ని నియమించింది త్వరలో పెబ్బేరు మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నందున ఎలాగైనా ఈసారి మున్సిపాలిటీపై బిజెపి జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో సీనియర్ నేతలు ఉన్నారు. పట్టణ అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ ఉంది అన్ని సమీకరణలు అంచనా వేసి విద్యార్థి దశ నుండి పట్టణంలో చురుకుగా పనిచేస్తున్నందునా ఆయనను నియమించినట్టుగా తెలుస్తుంది.
గతంలో పెబ్బేరు మండల ప్రధాన కార్యదర్శి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గా పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. పట్టణంలోని ఐదారు వార్డులపై ప్రభావం చూపే వ్యక్తిగా అధిష్టానం గుర్తించి కీలక సమయంలో ముఖ్యమైన బాధ్యత అప్పగించినట్టుగా తెలుస్తుంది. అధ్యక్షుడితో పాటు సీనియర్ నాయకులు అయినా సుర గౌని రంగస్వామి గౌడ్ జిల్లా కౌన్సిల్ మెంబర్ గా నియమించడం జరిగింది.
దీన్నిబట్టి రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి గట్టి ప్రయత్నం చేస్తుందని నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షులు అన్నారు