పయనించే సూర్యుడు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్ (13: జనవరి) (ఆదోని నియోజకవర్గం)
పెరిగిన విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా, ట్రూ అప్, సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, అదానీ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని కోరుతూ సి.పి.ఎం. పార్టీ ఆధ్వర్యంలో ఇందిరానగర్ నందు "భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల దగ్ధం" చేయడం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న,నాయకులు వీరేష్, సతీష్, శ్రీకాంత్, మోహన్ జమీర్ తదితరులు పాల్గొన్నారు.