
హేతువాద దృక్పథాన్ని బలపరచుదాం
దక్షిణ భారతంలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమాన్ని బలపరుచుదాం
డా.బి.ఆర్.అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ రి.నం 717/1978
{పయనించే సూర్యుడు} {డిసెంబర్ 25 మక్తల్ }
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో స్థానిక పెరియర్ చౌరస్తాలో పెరియర్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 1879 సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఏరోడ్లో ధనవంతమైన బలిజ కుటుంబంలో పుట్టిన పెరియార్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల ద్వారా,కాశి యాత్రలో బ్రాహ్మణుల ద్వారా ఎదురైన కుల అసమానతులకు,వివక్షతలకు కారణం వలసవాద అగ్రకుల బ్రాహ్మణిజమేనని గ్రహించాడన్నారు.
ఈ క్రమంలోనే అగ్రకుల బ్రాహ్మణ పక్షపాతంగా ఉన్న కాంగ్రెస్ను వదిలేసి,సమ సమాజ స్థాపనకు 1925లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని చేపట్టి స్త్రీ అణచివేతకు,మత వ్యతిరేకతకు,సామాజిక, ఆర్థిక,రాజకీయ సమానత్వానికి కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త,రాజకీయవేత్త పెరియారన్నారు.అంతేకాకుండా మూఢనమ్మకాల నిర్మూలనకై భారతీయ సమాజంలో శాస్త్రీయ- హేతువాద దృక్పధాన్ని పెంపొందించి భారతీయ ఆధునిక సోక్రటీస్గా పేరుందిన పెరియర్ ఆచరణలో చార్వాకాశ్రమ స్థాపకుడు రామకృష్ణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని మంగళగిరిలో ఏర్పాటుచేసిన నాస్తిక పాఠశాల ద్వారా, ప్రతి సంవత్సరం పిబ్రవరి నెలలో జరిపే నాస్తిక మేళా ద్వారా మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేస్తున్నారన్నారు.అదే విధంగా 1937లో హిందీ వ్యతిరేక ఉద్యమం నడిపి వలసవాద ఆర్య సంస్కృతికి సవాల్ విసిరి మనువాదుల గుండెల్లో రివాల్వర్ అయినా పెరియార్ స్ఫూర్తిగా నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై రుద్దుతున్న హిందీ భాష సంస్కృతిని ఎదుర్కోవాలన్నారు.కార్యక్రమంలో.అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, పెరియార్ సంఘం నాయకులు అక్షయ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లపల్లి నారాయణ, పెద్ద అంజప్ప, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి, ఆర్టిఐ నాయకులు నారాయణ, కేఎన్పిఎస్ నాయకులు బండారి నర్సప్ప, విజయ్ కుమార్, ఉప్పర్ పల్లి, ఉజ్జల్లి,ముడుమల్ అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షులు బాలకృష్ణయ్య, ఓబ్లేస్, తిమ్మప్ప, రాకేష్ ఉజ్జల్లి,టీచర్ నాగేష్,అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ కోశాధికారి త్రిమూర్తి, కార్యవర్గ సభ్యులు అంజయ్య కోశాధికారి,పుడమి ఫౌండేషన్ నాయకులు రవికుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జుట్ల అంజప్ప,పొర్ల నరసింహులు, పోర్ల నరేందర్, ముగ్ధంపూర్ మాజీ సర్పంచ్ మోహన్, కర్రె మంజప్పా, అంబేద్కర్ యువజన సంఘం క్రియాశీలక నాయకులు&సభ్యులు బ్యాగరి శ్రీహరి,తల్వార్ నరేష్, కర్రెమ్ రమేష్, జగ్గలి రాజు, అశోక్ ఫోటోగ్రాఫర్, జగదీష్, బైని రవికుమార్,ఎల్ల లింగప్ప, సాయి, బైని నర్సింలు,ఉదయ్, సందీప్,తరుణ్, బైనీ శివ, గణేష్, అశోక్, పురుషోత్తం,గణేష్,ఆనంద్, సాగర్ పొర్ల, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
