
పయనించే సూర్యుడు న్యూస్ :పెళ్లి జరిగిన కొద్దిసేపటికే.. గుండె పోటుకు గురై హాస్పిటల్‌కు తరలించేలోపే వరుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. అప్పటి వరకు నవ్వులు, సంతోషాలతో నిండిన ఆ వివాహ వేడుకా ఒక్కసారిగా నిశబ్ధంగా మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. వరుద్ తహసీల్‌లోని పుస్లా గ్రామంలో మంగళవారం జరిన పెళ్లి వేడుకలో ఈ విషాదం సంఘటన చోటు చేసుకుంది. రెవెన్యూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల అమోల్ ప్రకాష్ గాడ్బోలే, నాగ్‌పూర్ జిల్లాకు చెందిన ఒక మహిళను మంగళవారం తెల్లవారుజామున వివాహం చేసుకున్నాడు. పుస్లాలోని శ్రీ విఠల్ రుక్మిణి ఆలయంతో వీరి వివాహం వేడుక బంధువులు, మిత్రులు, అతిథులు సమక్షంలో ఎంతో అట్టహాసంగా జరిగింది.అయితే అక్కడున్న వారిలో ఈ ఆనందం కొద్ది క్షణాలు కూడా ఉండలేదు.. పెళ్లి జరిగిన కాసేపటికే వరుడు అమోల్ అసౌకర్యానికి గురై పెడ్డి మండపంలోనే కుప్పకూలిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని పుస్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.. కానీ అక్కడి వైద్య అందకపోవడంతో.. స్థానికంగా మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అమోల్‌ను పరీక్షించిన వైద్యులు అతను గుండెపోటు కారణంగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.అది విన్న వరుడు, వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెళ్లైన కొద్ది క్షణాల్లోనే వరుడు ప్రాణాలు కోల్పోవడంతో.. అమోల్ కుటుంబ సభ్యులతో పాటు, వదువు ఆమె కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపించారు. పెళ్లి వేడుకను చూసేందుకు వచ్చిన బంధువులు సైతం కుటుంబ సభ్యుల రోధన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.