పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 21
అల్లూరి జిల్లా , చింతూరు మండలం పేగ పంచాయతీ లో ఏడుగురాళ్ళ పల్లి నుండి , పేగ వరకు గల బీటి రోడ్డు దాదాపు 40సంవత్సరాలుగా ఉన్న రోడ్డు గుంతలు పడి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు గర్భిణీ స్త్రీలలను , రోగులను , అంబులెన్స్ లో తీసుకెళ్ళడానికి గాని రైతులు మందుకట్టలు తీసుకొని రావడానికి కూడా అవకాశం లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. 2021 సంవత్సరం లో 18 కిలోమీటర్ల రోడ్డు మంజూరు అయినది దానికి 6 కిలమీటర్ల రోడ్డు పోయడానికి అటవి శాఖ అభ్యంతరం వలన రోడ్డు నిర్మాణం ఆగిపోయింది.ఈ రోడ్డు పై 24 గ్రామాలు, 6369 మంది జనాభా ప్రయాణిస్తారు , అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కి, మరియు మండల కార్యాలయాలకు వెళ్లడానికి సరైన దారి లేక అవస్థలు పడుతున్న అనుమతులు ఇవ్వడానికి కాల యాపనం చేస్తున్న అధికారులు , ఐటిడిఏ ల చుట్టూ ఎన్ని సార్లు తిరగాలని సర్పంచ్ పాయం చంద్రయ్య అధికారులను ప్రశ్నించారు.ఇప్పటికీ మేము కలవని అధికారి లేరు.మేము లెటర్లు ఇచ్చినవి అన్ని చెత్త బుట్టలో వెళ్తున్నాయా.గిరిజన పల్లెలు అంటే ఎందుకు చులకన అని మండి పడుతున్నారు.ఇప్పటికీ స్పందన లేక పోతే ఐటిడిఏ మరియు DFO ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు.. సోడే శ్రీను గోటుల్ కో ఆర్డినేటర్, పీసం పొద్దయ్య, పటేల్ తోడం చంద్రయ్య ,(అటవీ హక్కుల కమిటీ చైర్మన్,) సోయం అర్జున్ , పీసా కార్యదర్శి,) రాఘవ గోరం , లక్ష్మయ్య, జోగయ్య , కుంజా జోగయ్య , తదితరులు పాల్గొన్నారు..