పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 12, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ : కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎటువంటి షరతులు లేకుండా పట్టణంలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు, రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక రెవెన్యూ భవనం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఇంటి స్థలాలు లేని లబ్దదారులతో ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయము దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు పట్టణ కార్యదర్శి సుదర్శన్ మండల కార్యదర్శి కల్లుబావి రాజు రైతు సంఘం జిల్లా నాయకులు బసాపురం గోపాల్ తదితరులు మాట్లాడుతూ ..పట్టణములో వందలాది మంది ఇల్లు స్థలాలు లేని నిరుపేదలు పూరి గుడిసెల్లో అద్దె ఇండ్లలో నివసిస్తున్నారని, గత ప్రభుత్వములో పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఒక సెంటు స్థలం ఇచ్చి 1,80,000 రూపాయలతోనాణ్యతలేని ఇల్లు నిర్మిస్తున్నారని ఇచ్చిన ఇంటి స్థలాలు నివాసానికి ఉపయోగకరంగా లేవని ప్రభుత్వానికి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి రెండు సెంట్లు స్థలము ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు టీ.వీరేష్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శిలు ఏ విజయ్ లక్ష్మీనారాయణ కుమారస్వామి ప్రజా సంఘాల నాయకులు వెంకన్న వైటి భీమేష్ షేక్షావలి ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బస్సాపురం లింగప్ప అంజిత్ గౌడ్ రమేష్ ఏఐఎస్ఎఫ్ నాయకులు దస్తగిరి శ్రీకాంత్ సిపిఐ నాయకులు సోమన్న చాంద్ బాషా శ్రీనివాసులు,బుజ్జి నల్లన్న, హనుమప్ప తదితరులు పాల్గొనడం జరిగింది.