పయనించే సూర్యుడు న్యూస్ (జనవరి :10)పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం రిపోర్టర్ కుడారి జాన్సన్
వార్త విశ్లేషణ:-చిలకలూరిపేట:
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శుక్రవారం పేదలకు పేదలకు నివేశన స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పేదలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో వారికి రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 3సెంట్లు స్థలాలు ఇవ్వాలన్నారు. జగన్ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సాయం ఏమాత్రం సరిపోలేదన్నారు. పెరిగిన ధరల దృష్ట్యా పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం చేయాలని, ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. సీపీఐ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం డిప్యూటీ తాహసిల్దార్ వెంకటేశ్వరావు కు అర్జీలను అందజేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా కన్వీనర్ షేక్ సుభాని, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, వేలూరు గ్రామ సిపిఐ కార్యదర్శి కందిమల్ల వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు చౌటుపల్లి చిన్నబాబు, కే మల్లికార్జున్, ఏఐ వై ఎఫ్ పట్టణ కన్వీనర్ బి. రాంబాబు నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చౌటుపల్లి నాగేశ్వరరావు నాయకులు నాసర్, బొంత నాగయ్య తదితరులు పాల్గొన్నారు.