
పయనించే సూర్యుడుD.30.06.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.నిజామాబాద్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ,అనారోగ్యం, ప్రమాదాలు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప భరోసాగా నిలుస్తోందన్నారు. ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ మానవతా దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు.ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వారికి అవసరమైన సమయంలో సహాయం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించే సీఎంఆర్ఎఫ్ పథకం అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని తెలిపారు.నిజామాబాద్ పట్టణంలోని పలు డివిజన్లకు చెందిన మొత్తం 42 మంది లబ్ధిదారులకు రూ.28 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు షబ్బీర్ వెల్లడించారు.భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు అయ్యేలా తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి పారదర్శకంగా అమలవుతోందని ఆయన పేర్కొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేదా ఖర్చులు లేకుండా నేరుగా అర్హులైన లబ్ధిదారులకే చెక్కులు అందజేస్తున్నామని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేసి నిజమైన అర్హులకు ఈ పథకం ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నూడ చైర్మన్ కేశ వేణు , శేఖర్ గౌడ్, ఆకుల లలిత, బొబ్బిలిరామకృష్ణ ,జావిద్ అక్రమ్, కరీం, రత్నాకర్, ఫహిం, అరుణ్ ఖాన్, హాఫిజ్ లైక్ ఖాన్,అహ్మద్, నయీమ్ షహరాన్,పాపా ఖాన్, జాఫర్ హుస్సేన్, వహీద్, ముజాహిద్ ఖాన్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.