
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3 మక్తల్: మక్తల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు, బుధవారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి వైఎస్సార్ చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.ముఖ్యమంత్రిగా వైఎస్సార్ అమలు చేసిన ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, 108 అత్యవసర సేవలు, 104 వైద్య సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, పావలా వడ్డీ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపాయని గుర్తుచేశారు. ముఖ్యంగా రైతు కుటుంబాలకు అండగా నిలిచి, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైఎస్సార్‌దే అన్నారు.పదవులు మారవచ్చు.. ప్రభుత్వాలు మారవచ్చు.. కానీ ప్రజల కోసం చేసిన మంచి పనులు ఎప్పటికీ చెరిగిపోవు అని నాయకులు పేర్కొన్నారు. వైఎస్సార్ చూపిన సంక్షేమం, అభివృద్ధి మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కొనసాగిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యుఐ. నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని మహానేత వైఎస్సార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.