
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
సీఎం సహాయ నిది చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
( పయనించే సూర్యుడు జనవరి 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
పేద ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ తో పాటు సీఎం సహాయ నిధి చెక్కులను రాయికల్ గ్రామ లబ్ధిదారులు 1) సంద సత్యనారాయణ రూ. 27,000/– 2) గురువుల యాదయ్య రూ.32,500/–, 3) సంద నిర్మలమ్మ రూ 40000/– 4) తంగెళ్ళపల్లి లక్ష్మమ్మ రూ 40,000/– 5) నూకం జంగమ్మ రూ 60000/– మరియు ఫరూఖ్ నగర్ మండలం కు చెందిన సుమారు 68 మంది లబ్ధిదారులకు 27,35,000/– రూపాయల చెక్కులను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను అదుకోవాలని, వారికి అండగా ఉండాలనె ఉద్దేశంతో ఒక్క వైపు ఆరోగ్య శ్రీ వైద్యం చేయిస్తూ మరోపక్క సియం రిలీఫ్ ఫండు చెక్కులు పంపిణి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, రాయికల్ శ్రీనివాస్, మామిడిపల్లి వెంకట్ రెడ్డి, అంచ రాములు, లైక్ భాయ్, భరత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
