
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
బాల్కొండ నియోజకవర్గంలో పేదవారి ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లు నిలుస్తున్నాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.ఈరోజు శుక్రవారం రోజున ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని ప్రారంభించారు.ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో సాట్ల నడ్పి రాజు గారి ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొని వారికి ముఖ్యమంత్రి చిత్రపటాన్ని బహుకరించారు.వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో ముత్యాల సంధ్యా ప్రభాకర్ ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహూకరించారుబాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో షబానా బేగం ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహుకరించారు.బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో నవీన్ యాదవ్ నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహుకరించారు.బాల్కొండ మండల కేంద్రంలో నాగేష్ గారి ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహుకరించారు.నియోజకవర్గంలో అర్హత కలిగి ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
