
రుద్రూర్, ఫిబ్రవరి 24 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండలం అంబం(ఆర్) గ్రామానికి చెందిన ఓ నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి మంగళవారం అంబం(ఆర్) గ్రామ హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ చేయూతనిచ్చారు. నగదు 5000 వేలు, చీర పెట్టారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఈ యూత్ ఆధ్వర్యంలో సహాయం అందిస్తున్నారు. దీంతో పాటు గ్రామానికి చెందిన శానం జ్ఞానేశ్వర్ 3,000 వేల రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్లేపు గంగాధర్, ఉప సర్పంచ్ సాయిప్రసాద్, యూత్ సభ్యులు శానం గంగాధర్, మంత్రి సురేష్, తాహెర్, ఆనంద్, కమ్మరి రవి, అసం రాము, కపిల్, ఇందూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు