పయనించే సూర్యడు // మార్చ్ // 3 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. వీణవంక మండలం కొండపాక గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన పంజాల సంయుక్త వివాహం, ఈనెల 6వ తేదీ గురువారం రోజున ఉన్నందున ఈ విషయాన్ని, కొండపాక గ్రామస్తులు అతిధి బిల్డర్ కొమ్మిడి రాకేష్ రెడ్డి నర్సింగాపూర్ కి తెలుపగా, రాకేష్ రెడ్డి యువ సైన్యం ద్వారా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. సంయుక్త తండ్రి పంజాల శ్రీనివాస్ గత సంవత్సరం క్రితం చనిపోయాడు. నిరుపేదరికంలో కుటుంబం జీవనం కొన సాగిస్తున్నారు అని తెలిపారు . ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేన సతీష్ కుమార్, మార్కెట్ డైరెక్టర్ సునీల్, సమ్మయ్య సార్, శ్రీనివాస్, రామకృష్ణ, ప్రశాంత్, రమేష్, కొమురయ్య, విద్యాసాగర్,రమేష్, మొగులయ్య, కొమురయ్య, రాజయ్య, రాజు, సురేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.