కావేరి సీడ్స్ ఆర్గనైజర్ అంబాల కిరణ్..
పయనించే సూర్యుడు // ఫిబ్రవరి // 22 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఎండి రిజ్వానా వివాహం ఈనెల 23వ తేదీ ఆదివారం రోజున ఉండగా, అట్టి వివాహానికి గ్రామంలోని కొంతమంది దాతల సహకారంతో వివాహం చేయుచున్నారు. ఇట్టి విషయాన్ని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో తెలుసుకున్న కోర్కల్ గ్రామ కావేరి సీడ్స్ ఆర్గనైజర్ అంబాల కిరణ్,ఐదువేల (5000)రూపాయలు ఆర్థిక సహాయం పెళ్లికూతురు తల్లి అలీమాకు అందజేసినారు. రిజ్వానా తండ్రి ఇబ్రహీం గత ఐదు సంవత్సరాల క్రితం చనిపోయినాడు.చాలా నిరుపేదరికంలో కుటుంబం జీవనం సాగిస్తున్నారు.రిజ్వాన వివాహాన్ని దాతల సహకారంతో 23వ తేది ఆదివారం రోజున జరిపిస్తున్నారు. కావేరి సీడ్స్ ఆర్గనైజర్ అంబాల కిరణ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో నిరుపేద కుటుంబాలకు మా కావేరి సీడ్స్ ఆర్గనైజేషన్ తరపున సాయం అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు గోనెల సమ్మన్న, ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్,సభ్యులు ఎండి షాబొద్దీన్,గూడెపు సమ్మయ్య చల్లూర్ మాజీ వార్డ్ మెంబర్,రాయణవేణిఅంజి, అంబాల సదానందం సంగి రాజు ,పూదరి సాయి, అమృత అజయ్, రాయనవేణి సదయ్య, కుమార్, రఘు, మహమ్మద్ అజారుద్దీన్, ఎండి లాల్ మహమ్మద్, ఎండి జాఫర్ కుటుంబ సభ్యులు ఎండి అంకూష్,ఎండి మహమ్మద్, అలీమా,ఎండిఅమీర్ తదితరులు పాల్గొన్నారు.