
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లా సూళ్లూరుపేట
పట్టణంలో ఒక వింత ఆచారం మొదలుపెట్టేశారు అధికారులు... పట్టణంలో సక్రమంగా వీధి దీపాలు లేవు, పారిశుధ్య లేదు,రోడ్లు గుంతలు వీధులు ఆక్రమణలకు గురవుతూ ఉండంవల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువ గా ఉంది ఇన్ని సమస్యలు ఉంటే వీటిని సరి చేయడానికి ప్రస్తుతం ప్రభుత్వం ఒక ఆర్డిఓ ని నియమిం చింది ఆయన అన్నింటికీ నిధులు సమకూర్చి ప్రజలకు అత్యవసర కార్యక్రమాలను నెరవేర్చడమే ఆయన పని... కానీ ఆయన ఆఫీసుకు పోయే దారిని చూస్తేనే వీరి నిర్వహణ ఎంత బాగుందో ఉందో ఇట్టే అర్థమైపోతుంది ఇటువంటి అధికారులు తమ ఆఫీసును పరిశుభ్రంగా ఉంచుకోలేదు ఆ విషయం అడిగితే ఫండ్స్ లేవు అని సమాధానం చెబుతారు కానీ నెలకు ఒకసారి స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలు అనునిత్యం రద్దీగా తిరుగులాడే బస్టాండ్ సమీపంలో తమ పూర్తిస్థాయి అధికారుల సహకారంతో ఆడంబరంగా నిర్వహించడం దాన్ని అడిగితే ప్రజలకు అవగాహన కొరకు చేస్తున్నాము అని చెప్పుకుంటూ పాలక అభ్యర్థులకు పబ్లిసిటీగా ఉండేందుకు ఈ పనులు చేసి పెడుతున్నారా? అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు సాయి నగర్ ఫ్లైఓవర్ కింద ఆర్డిఓ ఆఫీసుకి పోయే దారి లో పిడికెడు మట్టి వేయడానికి ఫండ్స్ లేని ఈ అధికారులు ఇటువంటి కార్యక్రమాలను మాత్రం టౌను నడిబొడ్డులో బస్టాండ్ సమీపంలో నిర్వహిస్తున్నారు వీటికి మాత్రం వీరికి కావలసినంత ఫండ్స్ వస్తున్నాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు