
ఎమ్మార్పీ తో సంబంధం లేదు-ఇష్టరాజ్యంగా చిరుతిళ్ళు
అధ్వానంగా ఉన్న టాయిలెట్స్
పయనించే సూర్యుడు జనవరి 10 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండలం లో ఉన్న శ్రీ లక్ష్మి నరసింహ సినిమా థియేటర్ యాజమాన్యం ప్రజల సౌకర్యాలతో సంబంధం లేకుండా ఇష్టరాజ్యంగా వ్యవహారిస్తున్నారు. టికెట్ మీద 100/ రూపాయలు అని ప్రింటింగ్ పెట్టుకుని పండగలు, పెద్ద హీరోల సినిమాల విడుదల సమయం చూసుకుని ఇదే అదును అనుకుని ఇష్టం వచ్చినట్టు రెండు రేట్లు ధర పెంచేస్తున్నారు. బ్రేక్ సమయం లో తినే చిరుతిళ్లకు, కూల్ డ్రింక్స్ కు కూడా ఎమ్మార్పి ధరలతో సంబంధం లేకుండా రెండు రేట్లు ధరలు పెంచి వసూళ్లు చేసుకుంటున్నారు. స్టాక్ ఉన్న స్నాక్స్ అమ్మడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. టాయిలెట్స్ కూడా అద్వాన స్థితిలో దారుణంగా ఉన్నాయి. ఆడవాళ్ల టాయిలెట్స్ గదులు మరీ ఘోరమైన దుస్థితి. వాహనాల పార్కింగ్ చోట చుట్టూ పిచ్చి మొక్కలు, పగిలిన గాజు సీసాలతో దారుణంగా ఉంది. విరిగిన కుర్చీలు, హాల్ లోపల పక్క కూడా పగిలిన గాజు ముక్కలు, పాన్ పరాక్, గుట్కాలు తిని ప్రేక్షకులు కూర్చునే సీట్స్ లోనే ఊసేస్తున్న థియేటర్ యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి లేదని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగల సమయంలో, సెలవుల్లో కుటుంబంతో సరదాగా గడపాలని థియేటర్ కి వస్తున్న ప్రేక్షకులే టార్గెట్ గా పెట్టుకుని, అధిక ధరలతో దోచుకుంటున్నారు. ఇటువంటి థియేటర్ యాజమాన్యం పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.