హాజరైన డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ. క్రాంతి కుమార్. పయనించే సూర్యుడు: ఫిబ్రవరి 17: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ. వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు ఏహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం ఐటీడీఏ ఏటూరి నాగారం పిఓ ఆదేశాల మేరకు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ యోషిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరం నందు 80 మందికి బాల బాలికలకు మరియు ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జ్వర పీడితులు ఎవరు కూడా నమోదు అవ్వలేదని, జలుబు మరియు దగ్గుకు 20 మందికి చికిత్స చేయడం జరిగినదినీ డాక్టర్ యోషిత తెలియజేశారు. అంతే కాకుండా మిగతా వారికి కూడా చిరు వ్యాధులకు చికిత్స చేయడం జరిగినదని తెలిపారు బాల బాలికలకు ఆరోగ్య విషయాల మీద అవగాహన గూర్చి ఆరోగ్య విద్యా బోధన చేయుటం కూడా జరిగినదని అన్నారు. వసతి గృహ ఆవరణలో మరియు వంటశాల ప్రాంతంలో పరిశుభ్రత మరియు త్రాగునీటిని పరిశీలించడం జరిగినని హాస్టల్ నందు పని చేస్తున్న ఏఎన్ఎం జ్వరము మరియు అస్వస్థత వస్తే ప్రథమ చికిత్స చేసి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగినది తెలిపారు. ముందుస్తు జాగ్రత్తల చర్యలలో భాగంగా 5% ఆల్పా సైపర్ మైత్రిన్ అనే దోమల మందును హాస్టల్ మరియు వంటశాల, పాఠశాల ఆవరణ లోపల పిచికారి చేయడం జరిగినదతెలిపారు. ఈయొక్క కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ క్రాంతి కుమార్, డాక్టర్ యోషిత, ఎన్.హెచ్.ఎం.ప్రోగ్రాం ఆఫీసర్ మహేందర్ , హెచ్.ఇ.ఓ. వేణుగోపాలకృష్ణ, పి.హెచ్.ఎన్. సంగీత, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి , ఎం సి హెచ్ నర్సింగ్ ఆఫీసర్ అనూష , ఏఎన్ఎం శకుంతల, ఆరోగ్య కార్యకర్త శ్రీను, ఆశ్రమ స్కూలు ధానోపాధ్యాయులు మరియు వార్డెన్ వారి సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.