పిబ్రవరి 8 జనంన్యూస్ వెంకటాపురం రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు స్టేషన్ ను ఏటూరునాగారం ASP శివమ్ ఉపాధ్యాయ IPS మరియు, బండారి కుమార్ CI వెంకటాపురం పేరూరు పోలీస్ స్టేషన్ సందర్శించి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన అన్ని రికార్డ్స్ పరిశీలించనైనది, ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో పాటిస్తున్న 5-S ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఇలాగే కొనసాగించాలని సూచించనైనది, మరియు పోలీస్ స్టేషన్ మొత్తం పరిసరాలు, CRPF క్యాంపు లోని అన్ని గార్డులను తనిఖీ చేసి తగు జాగ్రత్తల సూచించనైనది, CRPF DSP గారితో సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తదనంతరం పోలీస్ స్టేషన్ లో కొత్తగా నిర్మిస్తున్న సెక్యూరిటీ పెన్సింగ్ గురించి తగు సూచనలు చేసినారు, పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి మంచి చెడులు అడిగి తెలుసుకున్నారు. మరియు G. కృష్ణ ప్రసాద్ SI కి మరియు సిబ్బంది కి, గంజాయి, గుడుంబా, కోడిపందాలు, పేకాట మరియు అటవీ జంతువుల వేట గురించి కరంటు తీగలు పెట్టె వారిని ఉపేక్షించ రాదని వారి పైన కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు పడేలా చూడాలని, మరియు మావోయిస్టుల కదలికల పైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని ఎ ఎస్ పి శివమ్ ఉపాధ్యాయ ఐ పి ఎస్,సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి రవికుమార్ ఆదేశించారు.