పయనించే సూర్యుడు ఆగస్టు 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
పలు గ్రామాలకు రాకపోకలు బంద్.
పల్లె రోడ్లన్నీ అధ్వానం.
చెరువులు, వాగుల వద్దకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరికలు.
ఏన్కూర్ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏన్కూర్ మండల వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండల పరిధిలోని అంజనాపురం- జన్నారం వాగు పై ఉన్న వంతెన పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల రాకపోకలు రాకపోకలు నిలిపివేశారు. అదేవిధంగా మేడిపల్లి వాగు పై ఉధృతంగా వరదరావడంతో రాకపోకలు తీవ్రంగా స్తంభించిపోయాయి. జన్నారం అంజనాపురం వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిపి వేస్తున్నట్లు హెచ్చరిక బోర్డులనుఏర్పాటు చేశారు. వంతెనలు, నీళ్లు ప్రవశిస్తున్న రోడ్డు ను దాటేందుకు ఎవరూ సాహసించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఏన్కూర్ ఎస్సై రఫీ, మండల తాహ సిల్దార్ సిహెచ్ శేషగిరిరావు సూచించారు. ఇది ఇలా ఉండగా లింగన్నపేట చెరువు నుండి అలుగు పడటంతో తిమ్మారావుపేట వెళ్లే రోడ్డు పై వాహనదారులు రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెరువుల దగ్గరకు చేపల వేటకు వెళ్లవద్దని పోలీసు , రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెరువులు, కుంటలు దగ్గరకు ఎవరు వెళ్ళవద్దని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో పిడుగులు పడే అవకాశం ఉందని దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.అంజనాపురం వాగు పై పొంచి ఉన్న ప్రమాదం.ఏన్కూరు మండల పరిధిలోని అంజనాపురం- జన్నారం వాగు పూర్తిగా దెబ్బ తిన్నది. దీంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిని కూలి ప్రమాదం ఉందని , వరద లు ఉధృతి తగ్గిన వెంటనే బ్రిడ్జిని మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను స్థానికులు కోరుతున్నారు.