{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 8} మక్తల్
మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు అవమానించేలా వ్యాఖ్యాలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మక్తల్ నియోజకవర్గ టౌన్ ప్రెసిడెంట్ గోలపల్లి జ్ఞాన ప్రకాష్ మాదిగ గారు డిమాండ్ చేశారు.ఈరోజు ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో MRPS మక్తల్ టౌన్ అధ్యక్షులు గోలపల్లి జ్ఞాన ప్రకాష్ మాదిగ మాట్లాడుతు బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ ని ఉద్దేశించి దున్నపోతు అనే మాటను ఉపయోగించి మాట్లాడడాని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అసంపూరిత వ్యాఖ్యల వల్ల దళితులు,బలహీన వర్గాల మధ్య దూరం పెరుగుతుందన్నారు.ఈ విషయాన్ని అర్థం చేసుకుని జరిగిన తప్పును సర్దుకునే విధంగా వెంటనే పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే సుప్రీ కోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గావాయ్ మీద జరిగిన దాడిని MRPS తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గావాయ్ దళితుడు కావడం వల్లనే కొన్ని ఆధిపత్య శక్తులు, జీర్ణించుకోలేకపోతున్నాయని, అందులో భాగంగానే చెప్పులతో దాడికి తెగబడే పరిస్థితికి వచ్చారని ఆ స్థానంలో ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంద నరసింహ మాదిగ గారు, ఉట్కూరు మండల ఇన్చార్జి కొర్ల హనుమంతు మాదిగ గారు, కర్నే గ్రామ అధ్యక్షులు H.వెంకటేష్ మాదిగ గారు, కృష్ణ మండల అధ్యక్షులు తేజ మాదిగ గారు, తదితర ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.