
పయ నించే సూర్యుడు ఆగస్టు 4 ముమ్మిడివరం (గ్రంధి నానాజీ)ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు మరియు విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా కోరంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న సభా స్థలాన్ని ఈరోజు ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరావు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, భద్రత, ప్రజలకు అవసరమైన ఇతర సౌకర్యాలపై అధికారులకు మరియు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నాయకులు సూచించారు. అదే రోజు జరిగే పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.