పయనించే సూర్యుడు న్యూస్ జూలై 18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) అనంతపురం జిల్లా యాడికి
స్వాతంత్ర సమరయోధుడు అనంతపురం జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో మూల స్తంభం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ,నిరంతరం పేదల పక్షాన పోరాడిన పోరాటయోధుడు కామ్రేడ్ వీకే ఆదినారాయణ రెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం యాడికి మండల సి.పి.ఐ.పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు అభిమానులు మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సి.పి.ఐ. సీనియర్ నాయకులు వి.కే.ప్రదీప్ రెడ్డి, సి.పి.ఐ.మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటరాముడు యాదవ్, జూటూరు అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి గ్రామంలో భూస్వామి కుటుంబంలో జన్మించిన వి.కే ఆదినారాయణరెడ్డి నిత్యం నిరుపేద బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కూలిడబ్బులు కోసం పోరాటాలు చేస్తూ భూస్వాములకు ఎదురు తిరిగి అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించారు. ఆయన కరువు ప్రాంతం అయినటువంటి రాయలసీమకు కృష్ణా జలాలు మళ్లించాలని ఉద్దేశంతో ఆనాడు అనేక రూపాలలో ప్రభుత్వం పైన పోరాటాలు చేసి ఇది సాధ్యమా అని అనుకున్న ప్రభుత్వాలు గానీ ,మేధావులుగాని ఆశ్చర్యపోయేలా ఈనాడు కృష్ణా జలాలు రాయలసీమకు వస్తున్నాయంటే కామ్రేడ్ వి.కే. ఆదినారాయణ రెడ్డి ఆలోచన విధానమే ఎందుకు నిదర్శనం. ముఖ్యంగా యాడికి కాలువకు కామ్రేడ్ వి.కే ఆదినారాయణ రెడ్డి పేరు పెట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపాలని తీర్మానించారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఓబిరెడ్డి సి.పి.ఐ.సీనియర్ నాయకులు శ్రీరాములు, నీలూరు లక్ష్మయ్య, సంజీవరెడ్డి, నారాయణరెడ్డి, విశ్వనాథరెడ్డి, పాపిరెడ్డి, జూటూరు బషీర్, గరిడి శివన్న, రామయ్య, వెంకటయ్య, చౌడప్ప, ఎల్.అండ్ .టి రసూల్, సి.పి.ఐ. మండల సహాయ కార్యదర్శి వడ్డె రాముడు, సి.పి.ఐ. పట్టణ కార్యదర్శి చిన్న కుళాయి రెడ్డి, సి.పి.ఐ. యూత్ నాయకులు జూటూరు మహబూబ్ రబ్బాని, నాయకులు వెంకటస్వామి, నారాయణస్వామి, కాలనీవాసులు వెంగమ నాయుడు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.