ఈ భూములపై జరుగుతున్న వివదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
5వ షెడ్యూల్ ప్రాంతం లో గిరిజనేతరులకు అన్ని రకాల హక్కులు తొలగించాలి.
ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ డిమాండ్.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగష్టు 18
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం పోలవరం ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రభుత్వ, ప్యాకేజి తీసుకున్న భూములను ఆదివాసులకే అప్పజెప్పాలని,ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి కుంజా.అనిల్ డిమాండ్ చేశారు. ఐదో షెడ్యూల్డ్ ప్రాంతంలో వలస వచ్చిన నాన్ ట్రైబల్స్ భూమిపై ఏ హక్కులు లేకపోయినా పరిహారం తీసుకుని ఆదే భూములను మైదానవాసులకు లీజులకు ఇచ్చుకుంటున్నారన్నారు.ఆ భూములను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్థానిక ఆదివాసులకు పంచాలని డిమాండ్ చేసారు. వలస వచ్చిన నాన్ ట్రైబల్స్ కు ఏజెన్సీ ప్రాంతంలో ఓటరు నమోదు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మొదలైన గుర్తింపు పత్రాలు, సంక్షేమ పధకాలు ఇచ్చి తప్పు చేస్తుందని,ఇలా చెయ్యడం వలనే గిరిజానేతరులకు మా ఆదివాసీలకు తరసు వివాదాలు జరుగుతున్నాయని,ఈ వివాదాలకు కారణం ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులేనని మండిపడ్డారు.ఏజెన్సీలో వారికి జారీ చేసిన గుర్తింపు పత్రాలు, సంక్షేమ పధకాలు వెంటనే వారివారి సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలనీ డిమాండ్ చేసారు.అలాగే కొన్ని రాజకీయ పార్టీలా అనుబంధ గిరిజన సంఘాలు ఆదివాసీ హక్కుల గురించి పోరాడుతున్నట్టు అనిపించిన,నాన్ ట్రైబల్స్ కే ప్రయోజనం చేస్తాయని, ఇటువంటి కుట్రాపూరిత చర్యలను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ నిషతంగా పరిశీలిస్తుందని, అన్ని రాజకీయ పార్టీలు గమనించాలని సూచించారు.