పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 22 అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పట్ల ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చింతూరు, వి ఆర్ పురం మరియు కూనవరం ముంపు మండలాలలో పర్యటించి నిర్వాసితుల సమస్యలు విని వారి వద్ద నుంచి వినతులు స్వీకరించడం జరిగింది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి కలల ప్రాజెక్టు అయినటువంటి పోలవరంకు సంబంధించి, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముంపు మండలాలను గుర్తించి మండలాన్ని యూనిట్ గా తీసుకొని ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా ఉదారంగా వ్యవహరించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం రాష్ట్రాన్ని విధి లేని పరిస్థితుల్లో విభజించాల్సి వచ్చినప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి కాబట్టి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తూ అందుకు అయ్యేటటువంటి మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా విభజన చట్టంలో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిర్వాసితుల పట్ల గత రెండు ప్రభుత్వాలు కర్కసంగ వ్యవహరించడం దారుణం 2017 వ సంవత్సరంలో చేపట్టినటువంటి సర్వే ప్రకారం ఇప్పుడు పరిహారం చెల్లిస్తున్నడం, అప్పటికి ఇప్పటికీ 18 సంవత్సరాలు నిండిన వారి సంఖ్య పెరిగి కుటుంబాల సంఖ్య పెరిగినప్పటికీ, వాటిని పరిగణలోకి తీసుకోకుండా నిర్వాసితులను గాలికి వదిలేయడం చాలా దారుణం. ప్రాజెక్టు నిర్వాసితుల ముంపు మండలాల్లో రీసర్వే చేసి నేటికీ 18 సంవత్సరాల నిండిన అర్హులైన అందరికీ పరిహారం అందేలా చూడాలి. గత పది సంవత్సరాల నుండి ముంపు మండలాలుగా పరిగణిస్తూ, సర్వేలు చేసి ఈ రోజున కొత్తగా ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం తో ముడి పెట్టీ మీ గ్రామాలు 41.5 మీటర్ల పరిధి లోకి రావు అని గాలికి వదిలేస్తున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు యొక్క నీటినిల్వ సామర్థ్యం 41.15 మీటర్ల వరకే పరిమితం చేస్తూ బడ్జెట్ బిల్లులో పొందుపరిచిన కూడా కూటమి ప్రభుత్వ నేతలు స్పందించకపోవడం నిజంగా, రాష్ట్ర రైతాంగానికి ఉరితాడు వేయడమే. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం యొక్క ఎత్తును తగ్గించడం వలన దాదాపు 80 టీఎంసీల నీటిని కోల్పోవడంతో పాటు, బహుళార్థక పోలవరం ప్రాజెక్టు కాస్త బ్యారేజ్ గా మారే ప్రమాదముంది. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ ఎత్తు 45.7 మీటర్ల వరకు వరకు ఉంచితే పవర్ ప్రాజెక్టు పని చేయడంతో సహా పోలవరం కుడి కాలువ గుండా గ్రావిటీ ద్వారా నదుల అనుసంధానానికి మార్గం సుగమవుతుంది, గోదావరి, కృష్ణా డెల్టా తో పాటు రాయలసీమకు సంబంధించినటువంటి పెన్నా ప్రాంతం కూడా సస్యశ్యామలమయ్యే ఈ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈరోజు మళ్లీ నదుల అనుసంధానం పేరిట లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేసేందుకు దాని కొరకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మళ్లీ రాష్ట్ర రైతాంగం నెత్తిన 86 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేందుకు ఈ కూటమి ప్రభుత్వం సిద్ధపడటం చాలా దారుణం. కావున కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర రైతాంగం పక్షాన, పోలవరం నిర్వాసితుల పక్షాన డిమాండ్ చేస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ ఆనాడు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం, కేంద్ర జల శక్తి శాఖలోని, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతించిన డిపిఆర్ ప్రకారం పూర్తి ఎత్తు సామర్థ్యంతో అనగా 45.7 మీటర్లు ఎత్తు వరకు నీటిని నిల్వ ఉంచి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి. నిర్వాసితులకు ఏర్పర్చిన పునరావాస కాలనీలలో పర్యటించినప్పుడు, పూర్తిచేసిన ఇండ్లమో నాణ్యత లోపం వల్ల అవి దెబ్బతిన్నాయి, చాలా కాలనీలు బేస్మెంట్ వరకే ఆగి ఉన్నాయి, కాలనీలలో ఎక్కడా కనీస మౌలిక వసతులు లేకపోవడం, పాఠశాలలు, మంచినీరు, స్మశానాలు లేకపోవడం వలన నిర్వాసితులు అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా లేకపోయినప్పటికీ బలవంతంగా తరలించడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. నిర్వాసితుల కాలనీలో మౌలిక సదుపాయాలపై వెంటనే దృష్టి పెట్టాలి అదేవిధంగా నిర్వాసితులు వారి గ్రామాన్ని వదులుకొని కొన్ని కిలోమీటర్లు దూరంలో ఉండే కాలనీలకు వచ్చినప్పుడు అక్కడ వారికి ఉపాధి ఏర్పరిచేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి, నిర్వాసితుల యొక్క ముంపు మండలాల్లో పశుగణన చేపట్టి పునరావాస కాలనీలో ఆ పశువులకు మేత కోసం మేత పోరంబోకు గా కొంత భూమిని కేటాయించాలి. రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం తన బిడ్డ షర్మిలమ్మ రాష్ట కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి, రాష్ట్ర రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటానికి సిద్ధమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్వాసితుల అధ్యయన కమిటీ చింతూరు డివిజన్లోని ముంపు మండలాల్లో సోమ మంగళవారాల్లో పర్యటించి నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చింతూరు డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పోలవరం నిర్వాసితుల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు మార్టిన్ లూథర్, ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, కమిటీ సభ్యులు డాక్టర్ Tk విశ్వేశ్వర రెడ్డి, S. బుల్లి బాబు, రామలక్ష్మి, పిసిసి డెలిగేట్ ఎండి హబీబ్, కాంగ్రెస్ నాయకులు ఎస్కే హామద్ అలీ, డాక్టర్ ఎస్ కే హనీఫ్, కూనరపు నరేష్ తదితరులు పాల్గొన్నారు