
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 2 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది వందల మంది మావోయిస్టులు చనిపోగా, అనేక మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలిసిపోతున్నారు దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు పార్టీ గట్టి ఎదురుదెబ్బలనే తింటూ వస్తుంది కీలకమైన అగ్రనేతలు చనిపోవడం, లొంగిపోవడంతో ఇక ఉద్యమాన్ని కొనసాగించలేమన్న తీరులో మావోయిస్టులు ఉన్నారు హిడ్మా, గణేశ్ వంటి మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మరణించారు తాజాగా మరోసారి మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది మావోయిస్టు పార్టీ ఏకైక బెటాలియన్ కమాండర్ బర్సే దేవా తెలంగాణ పోలీసులకు చిక్కినట్లు తెలిసింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.తెలంగాణ - ఛత్తీస్ ఘడ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంత అడవుల్లో ఆయనతో పాటు మరో 15 మంది సాయుధుల సంచారంపై పక్కా సమాచారంతో పోలీసులు నిఘా ఉంచడంతో మావోయిస్టుల బృందం వారికి చిక్కింది వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు వారంతా దేవా నేతృత్వంలోని బెటాలియన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు హిడ్మా తర్వాత కీలక నేత దేవా ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీకి ఉన్న కీలకమైన త్రయంలో దేవా కూడా ఒకరు పార్టీ చీఫ్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్ జీ, తెలంగాణ పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ తో పాటు దేవా ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ ఉన్నారు కొద్దిరోజుల క్రితం మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ఆయన సమకాలికుడు వయసులో హిడ్మా కంటే వారం రోజులు చిన్నవాడు మాత్రమే
దేవాది కూడా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని హిడ్మా స్వస్థలమైన పువర్తి గ్రామం
ఇంచుమించు ఇద్దరూ ఒకేసారి మావోయిస్టు పార్టీలో చేరగా, పార్టీ బెటాలియన్ కార్యకలాపాల్లో వీరిరువురు కీలకంగా వ్యవహరించారు పీఎల్జీఏ కార్యకలాపాలు ముగిసినట్లే మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు (సీఎంసీకి) వెన్నెముకగా నిలిచిన పీఫుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కార్యకలాపాలు దాదాపు ముగిసినట్లే కనిపిస్తోంది హిడ్మా మృతితో పీఎల్జీఏ మిన్ను విరిగినట్లు అవగా, దేవా చిక్కడంతో ఇక అది కనుమరుగైనట్లే అనే అభిప్రాయం కలుగుతోంది వాస్తవానికి మావోయిస్టు పార్టీ ఆపరేషన్లకు పీఎల్జీఏనే కీలకంగా వ్యవహరించింది 1999 డిసెంబర్ 2న కరీంనగర్ జిల్లా కొయ్యూర్ ఎన్కౌంటర్లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి ఎలియాస్ శ్యాం, ఎరంర్రెడ్డి సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేశ్, శీలం నరేశ్ మృతి చెందడంతో వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా పీజీఏను స్థాపించారు 2004 సెప్టెంబరు 21న సీపీఐ - పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ) తో కలిసి సీపీఐ - మావోయిస్టు పార్టీగా అవతరించింది ఆ తర్వాత పీజీఏనే పీఎల్జీఏగా రూపాంతరం చెందింది భారీ ఆపరేషన్లు నిర్వహించిన పీఎల్జీఏ అప్పట్లో 8 బెటాలియన్లు 13 ప్లటూన్లతో సుమారు 10-12 వేల మంది సైన్యంతో ఉన్న పీఎల్జీఏ మావోయిస్టు పార్టీ భారీ ఆపరేషన్లను నిర్వహించింది కాలక్రమేణా పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో బెటాలియన్లు అస్తిత్వం కోల్పోతూ వస్తూ ఉన్నాయి చివరగా హిడ్మా నేతృత్వంలోని మొదటి బెటాలియన్ మాత్రమే ఇప్పటివరకు మిలిటరీ ఆపరేషన్లకు వెన్నుదన్నుగా నిలిచింది దాదాపు రెండేళ్ల క్రితం బెటాలియన్ కమాండర్ గా ఉన్న హిడ్మా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జడ్సీ) కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు అనంతరం దానికి దేవా నేతృత్వం వహించారు ఇప్పుడు ఇలా దేవా తెలంగాణ పోలీసులకు చిక్కారు దీంతో దాదాపు మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ముగిసినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.