పయనించే సూర్యుడు న్యూస్// నారాయణపేట జిల్లా 25 తేదీ మార్చి :తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నిన్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆశ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన ధర్నా చేస్తుంటే పోలీసులు దౌర్జన్యంగా అక్రమంగా మహిళలు అని చూడకుండా అక్రమ అరెస్టు చేయడానికి నిరసిస్తూ ఈరోజు నారాయణపేట మండలం కోటకొండ భగత్ సింగ్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జి ధరించి నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. అనంతరం ఆశ వర్కర్ల యూనియన్ నాయకురాలు రాధిక మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వానికి తెలియజేయాలని శాంతియుతంగా నిరసన చేసే హక్కు ? కూడా మాకు లేదా అని ప్రశ్నించారు గ్రామాల్లో 24 గంటలు పని చేస్తూ నిరంతరం పేద ప్రజలకు సేవ ?చేయడమే మేము చేసిన పాపమా అని ప్రశ్నించారు. మాకు కుటుంబాలు పిల్లలు ఉన్నారు . 24 గంటలు పని చేసుకుంటూ ఉంటే మా కుటుంబాలతో ఎప్పుడు గడపాలని ప్రశ్నించారు. ఇచ్చే కొద్దిపాటి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో మేము ఎలా బతకాలని అన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు చేశారు.రాధిక భాగ్య పద్మ అంజమ్మ నరసమ్మ కృష్ణవేణి కల్పన జయమ్మ వెంకటేశ్వరి రేణుక పాల్గొన్నారు