పయనించే సూర్యుడు"ఫిబ్రవరి 15 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్ కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అయిన విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, ఆదోని ఎస్ డి పి ఓఅయిన ఎం. హేమలత వారి సూచనల మేరకు ఆదోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అయిన K. శ్రీ రామ్ 11.02.2025 వ తేదీన ఆదోని టౌన్ లోని మధు ఆసుపత్రి యజమాని అయిన శ్రీ గుర్రెడ్డి ఫిర్యాదు మేరకు, ఆదోని 1 టౌన్ పోలీసు స్టేషన్ నందు Cr. No 18/2025 u/s 308(2), 351 (2) r/w 3 (5) బి ఎన్ ఎస్ మేరకు రఘునాద్ మరియు అడివేష్ అను ముద్దాయులపై కేసు నమోదు చేయడమైనది. సదరు కేసులో ముద్దాయులు మధు ఆసుపత్రి లో ఎన్ ఎన్ టి ఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) పేరున చాలా అవకతవకలు జరుగున్నాయి . కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసి ఉన్నారు. సదరు పిర్యాదులను వెనుకకి తీసుకోవడానికి ఫిర్యాదు దారుడు అయిన గుర్రెడ్డి ని ముద్దాయులు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఉన్నారు. ఫిర్యాదు దారుడి అభ్యర్థన మేరకు 39 లక్షలకు ఒప్పుకుని, 5 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చే విదంగా డీల్ కుదుర్చుకోవడం అయినది. అంతేకాకుండా బలవంతంగా 10 వేల రూపాయలు ఫోనెపే కూడా చేయించుకున్నారు. సదరు కేసులో ముద్దాయులకు నోటీసులు ఇవ్వడానికి 12.02.2025 వ తేదీన సాయంత్రము 17.15 గంటలకు బాల భాస్కర్ మరియు ముని చంద్ర కానిస్టేబుళ్లు వెళ్ళగా వారిపై తిరగబడి దాడికి పాల్పడి గాయపరచి పారిపోవడము జరిగినది. సదరు సంఘటనపై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు Cr No.19/2025 u/s 121(1) r/w 3(5) బి.ఎన్.ఎస్ of ఆదోని వన్ టౌన్ పిఎస్ కేసు నమోదు చేయడమైనది. ఈ దినము అనగా 15.02.2025 వ తేదీన రాబడిన సమాచారము మేరకు ఆదోని ఎస్డిపిఓ అయిన ఎం. హేమలత పర్యవేక్షణలో ఆదోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అయిన. శ్రీ రామ్ , ఎస్ ఐ.రామ స్వామి మరియు సిబ్బంది ఆదోని టౌన్ లోని కొత్త బ్రిడ్జి వద్ద సదరు ముద్దాయులను అరెస్టు చేసి రిమాండుకు పంపడము జరిగినది. ప్రస్తుత పంచాయతీ రాజ్ డెపార్టుమెంట్ కు చెందిన డి ఈ ని కూడా డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సమాచార్ము ఉన్నది. గతంలో వీరిపై ఎస్వి పి ఎస్ లో కూడా కేసు నమోదు కాబడినది.ముద్దాయి ల వివరాలు :-కమ్మి ఏనుగుల రఘునాథ్, వయస్సు: 34 సంవత్సరాలు, s/o కిష్టప్ప, H.No.1-86, OC కాలనీ, 104- బసాపురం గ్రామము, ఆదోని మండలము కమ్మి అడివేష్ @ ఏనుగుల అడివేష్, వయస్సు: 35 సంవత్సరాలు, s/o సత్యన్న @ సత్య నారాయణ, H.No.1-1, OC కాలనీ, 104- బసాపురం గ్రామము, ఆదోని మండలమ