పయనించే సూర్యుడు జూలై 12 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన దళిత బిసి మహిళలు .శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ రెండవ వార్డు పరిధిలోని వెంకట్రాపల్లి గ్రామానికి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మహిళలు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలియపరిచారు. పూర్తి వివరాలు ఈ విధంగా వెంకట్రావు పల్లి ప్రాంతానికి చెందిన పాత, కొత్త తెలుగుదేశం వర్గాల మధ్య ఇటీవల ఇంటింటికి టిడిపి కరపత్రాల పంపిణీ సమయంలో గొడవ నెలకొంది. ఆ గొడవ నేపథ్యంలో విజయ్ అనే టిడిపికి చెందిన యువకుడి పై ఇటీవల వైఎస్ఆర్సిపి పార్టీ నుండి తెలుగుదేశం లోకి చేరిన వైసిపి కౌన్సిలర్ శివ కోటారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.కౌన్సిలర్ కూడా తమను బూతులతో కులం పేదిట దూషించాడని అక్కడ మహిళలు కూడా వార్డు కౌన్సిలర్ శివ కోటారెడ్డి పై ఫిర్యాదు చేశారు.వార్డు కౌన్సిలర్ ను పోలీస్ స్టేషన్ కు పిలవకుండా అతనిని విచారించకుండా మూడు రోజులైనా పోలీసులు స్పందించలేదని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు నేడు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయింపు చేసి ధర్నా నిర్వహించారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఆత్మకూరు ఎస్సై జిలాని వీరికి సర్దుబాటు చేసి తగు న్యాయం చేస్తానని చెప్పడంతో మహిళలు తమ నిరసన విరమించారు. తమ ఫిర్యాదు పై స్పందించి తమకు న్యాయం చేయకపోతే జిల్లా ఎస్పీని కూడా కలుస్తామని వీరు తెలిపారు. ఇద్దరి ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈరోజు పోలీస్ స్టేషన్ చేరుకొని తమ ఆవేదన తెలియపరిచిన వారిలో బాధితులుగా ఉన్న విజయ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు బంధువులు అయినా పాతపాటి.ప్రమీల, కట్ట. ప్రసన్న, పాతపాటి వెంకటేశ్వర్లు, పాతపాటి. రమేష్, కట్ట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.