ఫోన్ : కానిస్టేబుల్ లను సన్మానిస్తున్న దృశ్యం… రుద్రూర్, మార్చ్ 08 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హృదయపూర్వక రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శనివారం మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ లను రుద్రూర్ సీఐ కృష్ణ, రుద్రూర్ ఎస్సై సాయన్న, కోటగిరి ఎస్సై సందీప్ లు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సాగర్, హెడ్ కానిస్టేబుల్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.