మండలం కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు దాచేపల్లి నర్సింగరావు
జనవరి 17 పయనించే సూర్యుడు. బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌసిక్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని బచ్చన్నపేట మండలం బీసీ సెల్ అధ్యక్షుడు దాచేపల్లి నర్సింగరావు అన్నారు. పార్టీలు మారే నీచ చరిత్ర మరియు భార్యాబిడ్డలను అడ్డం పెట్టుకొని చనిపోతానని బెదిరించి ఓటరు దగ్గర ఓట్లు దండుకున్న నీవా రేవంత్ రెడ్డిని విమర్శించడం అని వారు ఎద్దేవా చేశారు . నీచ రాజకీయాలు చేస్తూ తెలంగాణ ప్రజలను అమ్ముకున్న కచరా పార్టీలను నమ్ముకొని నువ్వు చేస్తున్న ఈ వ్యవహారాలు ఇంకా ఎన్నో రోజులు సాగవని వారు అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా అన్ని హామీలను పూర్తి చేసి తిరిగి అధికారాన్ని చేపడుతుందని అన్నారు