
పయనించే సూర్యుడు జనవరి 3 ( సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయం పక్కన ఉన్న ప్రాచీన అభయ శంకరుని ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ముందుగా దీపారాధన, అభిషేకాలు, ప్రత్యేక పూజలతో ఆలయం శివనామస్మరణతో మార్మోగింది.ఈ ఆలయంలో ప్రతిష్ఠితమైన శివయ్య బ్రహ్మసూత్రం స్వరూపమైన శివలింగం ప్రత్యేక విశేషంగా భక్తులను ఆకర్షిస్తోంది. శివుడు స్వయంభువుగా అవతరించినట్లుగా భావించే ఈ శివలింగానికి దర్శనం చేస్తే కష్టాలు తొలగి శాంతి, శ్రేయస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం. పౌర్ణమి రోజున ఈ శివలింగాన్ని దర్శించుకోవడం మహాపుణ్యమని ఆలయ పూజారులు తెలిపారు.పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన బారీఎత్తున అన్నదాన కార్యక్రమంలో AMC చైర్మన్ ఆకుతోట రమేష్ పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదం పంపిణీ చేశారు. “అన్నదానం మహాదానం” అన్న శివభక్తి భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని భక్తులు పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులు, స్థానికులు, శివభక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
