భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శినోముల భానుచందర్
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు
టేకులపల్లి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణం లో జరిగే రెండు ప్రగతిశీల యువజన సంఘంల విలీన ఐక్యత సభను జయప్రదం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి నోముల భానుచందర్,
మరియు జిల్లా నాయకులు తోటకూరి. సతీష్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామ్రాజ్యవాద విష సంస్కృతి కి వ్యతిరేకంగా పోరాడుతున్న రెండు సంఘాలు వేర్వేరు నిర్మాణాలు కలిసి ఉండడం వల్ల బలమైన యువజనోద్యమాన్ని నిర్మించలేక పోతున్నామని రెండు రాష్ట్ర కార్య వర్గ సభ్యులు చర్చించుకుని
ఈ రోజు ఆలేరు లో జరిగే విలీన ఐక్యత సభ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సభలో ముఖ్య వక్తలు గా టి.పి.టి.ఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి మైసా. శ్రీనివాస్, సిపిఐ ఎంల్ -న్యూడేమెక్రసి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి. మధు, కే. గోవర్దన్, బండారి ఐల్లయ్య, జనార్దన్, తదితరులు పాల్గొని మాట్లాడతారని ఈ ఐక్యత సభ కు యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని. పివైఎల్ జిల్లా సభ్యులు నోముల భాను చందర్ తెలియజేశారు.