( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 7 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ ) ఫరూక్నగర్ మండలంలోని బూర్గుల మరియు మధురాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులందరికీ ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ ఎత్తు మరియు బరువుతో పాటు హిమోగ్లోబిన్ రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది హిమోగ్లోబిన్ కిట్స్ ను భారత వికాస పరిషత్ అందించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఏఎన్ఎం హసీనా , సదాశివ రెడ్డి , ల్యాబ్ టెక్నీషియన్ స్నేహశ్రీ , ప్రగతి సీనియర్ మేనేజర్ మురళీకృష్ణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డేగశంకర్, గురుకుల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ , మధురాపూర్ హెచ్ఎం సునీత, ఆశ వర్కర్లు, ప్రగతి సిబ్బంది జగదీష్, శ్రీకాంత్, కార్తీక్, తులసి, లావణ్య, శృతి, ప్రగతి, శ్వేత మున్రే ఫార్మసీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.