
ఏడు పదుల వయస్సులో ఉదయం మార్నింగ్ వాక్ తో మొదలు రాత్రి వరకు అలుపు సలుపు లేకుండా ప్రచారం. యువకులే ఆశ్చర్యపోతున్న తీరు
.పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 8: అశ్వాపురం మండలంలో పంచాయతీ ఎన్నికలు సందర్భంగా చవిటిగూడెంలో విస్తృత ప్రచారం.పగలు రేయి తేడా లేకుండా ప్రచారంలో దూసుకుపోతున్న తెలుగు దేశం పార్టీ బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బానోత్ సదర్ లాల్ మరియు నాలుగు,ఐదు,ఆరు వార్డు సభ్యులు తుళ్లూరి ప్రకాష్ రావు, కొర్స ముత్తమ్మ, నూకల లింగయ్య,ఈ సందర్బంగా చవిటిగూడెం వీధుల్లో తిరుగుతూ ప్రజల ఓట్లు అభ్యర్ధిస్తున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత,నాయకులు షేక్ ఖధీర్,బూతం వెంకటేశ్వర్లు, తాడబోయిన వెంకటేశ్వర్లు, వలబోజు మురళీకృష్ణ,కడారి నగేష్,దాసరి భిక్షం, టీ డీ పి వాసు, మల్లెల రాము,కోర్లకుంట శ్రీనివాసవరావు,ఇలాసాగర కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
